ఆ ఐదుగురు అధికారులకు షాకిచ్చిన కలెక్టర్ పమేల సత్పతి

by Shyam |
Collector Pamela Satpathy
X

దిశ, భువనగిరి రూరల్: క్రమ శిక్షణ తప్పిన అధికారులపై యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కొరఢా ఝులిపించారు. విధి నిర్వహణలో అలసత్వం, నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ అధికారులకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. వెంటనే తనకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం ఈ ఆదేశాలు వెలుబడ్డాయి.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై ఇటీవల రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జిల్లా, మండల స్థాయి అధికారులతోపాటు ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుండాల, రాజపేట, బొమ్మలరామారం తహసీల్దార్లు హాజరు కాలేదు. దీంతో వారిపై కలెక్టర్ పమేల సత్పతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ఎందుకు హాజరు కాలేదో సంజాయిషీ ఇవ్వాలని ఛార్జ్ మెమోలు జారీ చేశారు. అలాగే రాయగిరి వద్ద నాటిన హరితహారం మొక్కలను కొట్టేసినందుకు సంజాయిషీ ఇవ్వాలని భువనగిరి మున్సిపల్ కమిషనర్, విద్యుత్ డీఈలకు మెమోలు జారీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ విధినిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తే ఎంత మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రతి సమీక్ష, సమావేశాలు పూర్తి సమాచారంతో ప్రతి శాఖ అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed