లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ ఆగ్రహం

by Shyam |
లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ ఆగ్రహం
X

దిశ, మహబూబ్‌నగర్: వనపర్తి పట్టణంలో ప్రజలు సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతుండటంపై జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తకోట పట్టణములో కర్నూల్ రహదారి, మదనపూర్ రోడ్డులో తెరిచిన షాపులను మూయించారు. అంతేకాకుండా, అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిపై మండిపడ్డారు. పని లేకున్నా ప్రజలు రోడ్లపైకి ఎందుకొస్తున్నారని.. చిన్న చిన్న కారణాలు సాకుగా చూపి బయటకు రావద్దని చెప్పారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వ ఆదేశాలను పాటించాలన్నారు. ఇళ్లల్లో నుంచి ఎవరు బయటకు రావద్దని కోరారు. ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే పోలీసులు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాష ఆదేశించారు.

Tags: Collector, Sheikh Yasmin Basha, outraged, lockdown violators, vanaparthi

Advertisement

Next Story