- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మొక్కల తొలగింపుపై కలెక్టర్ ఆగ్రహం
by Shyam |
దిశ, మెదక్: హరితహారం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ తీగలకు అడ్డంగా ఉన్నఅవెన్యూ ప్లాంటేషన్ చెట్లను తొలగించారు. ఈ ఘటన పాపన్నపేట మండలం పోడ్చన్ పల్లిలో చోటుచేసుకుంది. రోడ్డుకు ఇరువైపు ఉన్న అవెన్యూ ప్లాంటేషన్ చెట్లు ఏపుగా పెరిగి తీగలకు అడ్డంగా ఉన్నాయి. దీంతో మొక్కల కొమ్మలను తొలగిస్తే సరిపోయేదానికి ఏకంగా మొక్కలను తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ధర్మారెడ్డి ట్రాన్స్‌కో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ శాఖ వాల్టా చట్టం ప్రకారం రూ.4 వేల జరిమానా విధించడంతో పాటు అదే స్థలంలో మొక్కలను నాటాలని వారికి ఆదేశాలు జారీ చేశారు.
Tags: collector, transco staff, harithaharm, medak, forest act, ts news
Advertisement
Next Story