- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిజామాబాద్‌లో ప్రభుత్వ స్థలాల గుర్తింపు..
దిశ, నిజామాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన స్థలాలను గుర్తించే పనిలో జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ నిమగ్నమయ్యారు. వాటిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, స్మశాన వాటికలు, డంపింగ్ యార్డ్‌లు, స్మృతి వనాలు, ఓపెన్ జిమ్‌లు, పబ్లిక్ టాయిలెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం గతంలోనే యోచన చేసింది. ఆదివారం అర్సపల్లిలోని మత్స్యశాఖ, పశు వైద్య శాఖ, ఖిల్లా ప్రాంతంలోని స్మశాన వాటిక (సార్వజనిక), శివాజీనగర్లోని ఉపకార్మిక శాఖ, డిఈఓ ఆఫీస్, తిలక్ గార్డెన్, వ్యవసాయ మార్కెట్, జిల్లా పరిషత్ క్వార్టర్స్ ప్రదేశాలలో ఉన్న ప్రభుత్వ స్థలాలను అధికారులు పరిశీలించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కొరకు పట్టణ శివారు ప్రాంతాలను కూడా పరిశీలించారు.
స్మృతి వనాలు, ఓపెన్ గేమ్స్, పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించడానికి ప్రభుత్వ స్థలాలు గుర్తించి, అందులో అనువైన స్థలాలను సేకరించి కార్పొరేషన్‌కు అందచేయనున్నట్లు తెలిపారు.పట్టణ ప్రజలకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలను అన్ని వసతులతో నిర్మించుటకు స్థలాల పరిశీలన చేసినట్టు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.ఈ పర్యటనలో నిజామాబాద్ ఆర్‌డీ ఓ వెంకటయ్య, తహశీల్దారు హరిబాబు, మున్సిపల్ డిఇ రషీద్, మత్స్యశాఖ ఏడి రాజారాం, కార్మిక శాఖ అధికారి మోహన్, విద్యాశాఖ అధికారి జనార్ధన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ స్పెషల్ గ్రేడ్ సెక్రెటరీ స్వరూపరాణి, ఏడీ రియాజ్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.