- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ క్వారంటైన్‌లో 1200 మంది
దిశ, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1200 మంది క్వారంటైన్‌లో కొనసాగుతున్నట్లు కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని, మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిని వారితో సన్నిహితంగా ఉన్న దాదాపు 1200మందిని క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 4పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన గుర్తు చేశారు. ఇందులో ఇప్పటికే ఇద్దరు పూర్తి ఆరోగ్యంతో హోం క్వారంటైన్‌లో కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇక మిగిలిన ఇద్దరు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. క్వారంటైన్‌లో కొనసాగుతున్న వారిపై నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరూ నిర్లక్ష్యం చేయకుండా అధికారులు తనిఖీలు చేపడుతున్నారని చెప్పారు. హోం క్వారంటైన్‌లో కొనసాగుతున్న వారి ప్రాంతాల్లో ప్రతీ రోజూ రసాయనిక ద్రావణాలను, బ్లీచింగ్ పౌండర్‌ను చల్లుతున్నట్లు తెలిపారు.
tag: Collector MV reddy, comments, corona, quarantine, khammam