అధికారులు ఇంటింటికీ వెళ్లాలి.. నిర్మల్ కలెక్టర్ ఆదేశం

by Aamani |
Nirmal Collector
X

దిశ, నిర్మల్ కల్చరల్: స్థానిక సంస్థల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని పకడ్బంధీగా అమలు చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు సభలు, సమావేశాలు నిర్వహించరాదని, గ్రామాల్లో ఎన్నికల నిబంధనలపై అవగాహన కల్పించాలని సూచించారు. 18 సంవత్సరాలు నిండిన వారందరూ కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు ‘ఓటరు నమోదు’ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ, ఓటర్ల జాబితాల సవరణ, డోర్ టూ డోర్ సర్వే నిర్వహించాలని తెలిపారు. తప్పులులేని ఓటరు జాబితా సిద్ధం చేయాలంటే తహసీల్దార్లు ఇంటింటికీ వెళ్లి పకడ్బంధీగా సర్వే చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని డిగ్రీ కాలేజీల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు. ఓటరు జాబితా ప్రక్రియపై ఉన్నతాధికారుల నుండి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరికీ అవగాహన ఉండాలని అన్నారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, డాక్టర్ పి.రాంబాబు, రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed