కోవిడ్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

by Shyam |
కోవిడ్ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్
X

దిశ, సంగారెడ్డి: కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్యులకు సూచించారు. ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని కోవిడ్ వార్డులో పేషెంట్లకు అందుతున్న సౌకర్యాలు, ఆహారం, చికిత్స విషయాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు వివరాలపై హాస్పిటల్ సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగారెడ్డి, ఆర్డీవో నగేష్, తహసీల్దార్ స్వామి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story