డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయండి

by Shyam |
డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయండి
X

దిశ, మెదక్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం సిద్దిపేట పట్టణంలో తుది దశకు చేరుకోవడంతో లబ్ధిదారుల జాబితాను తయారు చేయాలని అధికారులను కలెక్టర్ వెంకట్రామరెడ్డి ఆదేశించారు. ప్రజలకు అర్ధమయ్యేలా పూర్తి వివరాలతో కూడిన నివేదికను తెలుగులో రూపొందించి సమర్పించాలన్నారు. మంగళవారం సిద్దిపేటలోని కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై క్షేత్ర స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాబితా రూపొందించే క్రమంలో అర్హులు, అనర్హులు ఎవరరు? వారి పూర్తి వివరాలు, దరఖాస్తుదారుడు ఏ కారణాల వల్ల అర్హుడు, ఒకవేళ అనర్హుడైతే ఎందువల్ల తిరస్కరించమో, అందుకు సంబంధించిన వివరాలను స్పష్టంగా తెలుగులో నివేదికలను తయారు చేయాలన్నారు. ఈ బాధ్యతలను అదనపు కలెక్టర్లు పద్మాకర్ , మొజమిల్ ఖాన్‌కు అప్పగించారు. వారం రోజుల్లో నివేదికలను పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని జిల్లా పాలనాధికారి స్పష్టం చేశారు. జాబితా తయారీలో ఎలాంటి పొరపాట్లు ఉండరాదని, పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని సూచించారు. మున్సిపల్, ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల వద్ద సమాచార కేంద్రాలను సైతం ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

Tags : siddipet, dobule bedroom houses, collecter venkatramireddy, ready eligile and non eligible condidates list

Advertisement

Next Story

Most Viewed