- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో చలిపంజా
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో చలిపంజా విసురుతోంది. సంగారెడ్డి జిల్లా న్యాలకల్‌లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 8.9 డిగ్రీలకు పడిపోయాయి. కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం డోంగ్లీలో 9.2, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్మాని మండలం గిన్నెధారిలో 9.3, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్‌లో 9.4, అల్గోల్‌లో 9.7 డిగ్రీలకు పడిపోయాయి. కాగా, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్ జిల్లాల్లో సగటున 10 డిగ్రీలకు తగ్గాయి.
ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాజేంద్రపురం బీహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ ఏరియాలో 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్‌లో కనిష్టంగా 12.4 డిగ్రీలు, గరిష్టంగా పఠాన్‌చెరు ప్రాంతంలో గరిష్టంగా 16.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ పరిధిలో 10 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
Advertisement
Next Story