- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇమ్యూనిటీ పెంచే కోల్డ్ టీ
దిశ, వెబ్ డెస్క్:
ప్రస్తుత టెక్ యుగంలో.. ఫుడ్ హ్యాబిట్స్ చాలా మారిపోయాయి. దాంతో పాటు తలనొప్పి వచ్చినా, తుమ్ములు వచ్చినా.. పరుగు పరుగున ట్యాబ్లెట్ వేసేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు నేచురల్ , సీజనల్ ఫుడ్ కు చాలా ప్రాధాన్యమిచ్చేవారు. అంతేకాదు ట్యాబ్లెట్స్ కు బదులు నేచురల్ రెమిడీ ఫాలో అయ్యేవాళ్లం. ఇప్పటికీ మన ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు ఉంటే.. జలుబు చేస్తే.. పాలల్లో పసుపు వేసి తాగమంటారు. మిరియాల పొడితో రసం చేసి తాగిస్తారు. ఆరోగ్యం కోసం.. కడుపులో బ్యాక్టీరియాను చంపేందుకు పరగడుపున తులసి ఆకులు లేదా వేప ఆకులు తినమంటారు. అయితే కరోనా టైమ్ లో మన ఇమ్యూనిటీ పెంచుకునేందుకు హెర్బల్, కోల్డ్ టీ ని తాగితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
తరతరాల నుంచి కొన్ని ఆహారపు అలవాట్లు కూడా వస్తుంటాయి. అంతేకాదు సీజన్ ను బట్టి కొన్ని రకాల పదార్ధాలను ఇంట్లో చేస్తుంటారు. ఈ కోల్డ్ టీ కూడా సమ్మర్ లో చాలామంది చేసుకునే వాళ్లు.
ఎలా చేసుకోవాలి :
రెండు కప్పులు వాటర్ ను మరగించాలి. ఆ నీటిలో అర చెంచా అల్లం, కొద్దిగా పసుపు, రెండు, మూడు లవంగాలు (కొద్దిగా దంచాలి), కాస్త మిరియాల పొడి, 5 తులసి ఆకులు, అర టీ స్పూన్ తేయాకులు వేయాలి.
మూడు నిముషాలపాటు మరిగించిన తర్వాత దించేయాలి. దీన్ని రెండు మూడు గంటలపాటు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. ఎప్పడూ తాగాలనిపించినా.. ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా తేనే కలుపుకుని తాగాలి.
తాగితే ఏం లాభం :
ఇందులో వాడిని ఇన్ గ్రీడియన్స్ అన్నీ కూడా మనలో ఇమ్యూనిటీని పెంచేవే. ఇవన్నీ కూడా నిత్యం మన లోపలున్న బ్యాక్టీరియాలు, వైరస్ లతో పోరాడతాయి.
– తులసిలో యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్, యాంటి ఫంగల్ గుణాలుంటాయి. తులసి మన శరీర డిఫెన్స్ మెకానిజమ్ ను బూస్ట్ చేస్తోంది. దాంతో వైరల్, బ్యాక్టీరియా, ఇనఫెక్షన్ల నుంచి మన శరీరం పోరాడుతుంది.
– అల్లం వల్ల కూడా ఉన్న ఉపయోగాలు మనకు తెలిసిందే. అల్లంలోని రసాయనాలు ఆస్తమా లక్షణాలు తగ్గటానికీ తోడ్పడగలవని ఓ అధ్యయనంలో తేలింది. ఇన్ ఫ్లేమేషన్ ను తగ్గిస్తుంది. బ్యాక్టీరియా, వైరస్ లతో పోరాడుతుంది.
-పసుపు చేసే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సని పనిలేదు. యాంటి ఇన్ ఫ్లేమటరీగా పనిచేసే పసుపులో ఎన్నో ఔషధ సుగుణాలున్నాయి. గొంతు ఇనెఫెక్షన్స్ తగ్గించడంలో, శరీరంలోని మలినాలను, విష పదార్థాలను తొలగించడంలో పసుపు చాలా బాగా పనిచేస్తోంది.
-లవంగాలు, మిరియాలు రెండూ కూడా యాంటి వైరల్, యాంటి బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంటాయి.