- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడింగ్ కిడ్స్..
కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్‌లు జీవితంలో భాగం అయిపోయాయి. వాటిల్లో ఉన్న అప్లికేషన్లు ఏది పనిచేయాలన్నా.. వాస్తవానికి అవి పనిచేయాలన్నా కోడింగ్ అవసరం. అది పైతాన్, జావా, సీ లాంగ్వేజ్ లాంటి ఏ భాష అయినా సరే, ఏదో ఒక కోడింగ్ అవసరం. కానీ ఈ కోడింగ్ నేర్చుకోవాలంటే ఇప్పటిదాకా బీటెక్ వరకు ఆగాల్సి వచ్చేది. ఆ బీటెక్‌లోనైనా సరిగా అర్థమవుతుందా అంటే అదీ లేదు. మళ్లీ ఏదో ఒక ఇనిస్టిట్యూట్‌లో చేరి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే తప్ప అది మెదడుకు ఎక్కదు. ఇక నుంచి ఆ అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త విద్యా విధానంలో ఆరో తరగతి నుంచే కోడింగ్ పాఠాలు నేర్పించనున్నట్లు ప్రకటించింది. ఇది ఒకందుకు శుభపరిణామమేనని అందరూ పొగిడేస్తున్నారు.
రోజుకో కొత్త టెక్నాలజీ విడుదలవుతున్నప్పటికీ కోడింగ్ బేసిక్స్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. కాబట్టి ఆ బేసిక్స్ ఏవో 6 నుంచి 10వ తరగతిలోపు నేర్పిస్తే అవి ఎప్పటికీ గుర్తుంటాయి. బేసిక్స్ బలంగా ఉన్నపుడే ప్రోగ్రామింగ్‌లో మంచి ఎదుగుదల ఉంటుంది. అయితే ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఎన్నో లెర్నింగ్ వెబ్‌సైట్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా కోడింగ్ పాఠాల కరిక్యులమ్ సిద్ధం చేశాయి. వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆటలు, క్విజ్‌లతో వారికి అర్థమయ్యే రీతిలో కోడింగ్ నేర్పిస్తున్నాయి. కోడింగ్, ప్రోగ్రామింగ్ అనేవి అంతులేని సబ్జెక్టులు కాబట్టి ఎంత నేర్చుకున్నా కొత్తవి పుడుతూనే ఉంటాయి. కాబట్టి ముందుగా పిల్లలకు కోడింగ్ మీద ఆసక్తి కలిగించాల్సిన అవసరం ఉంది. ఎలాగూ ఇప్పుడు స్కూల్ కూడా లేదు కాబట్టి ‘కోడింగ్ ఫర్ కిడ్స్’ అని యూట్యూబ్‌లోనూ, గూగుల్‌లోనూ సెర్చ్ చేసి మంచి కోర్సు ఒకటి వెతికి పట్టుకుని పిల్లలు నేర్చుకునే అవకాశాన్ని కల్పించండి.