ఆఫ్ఘన్ తొలి ‘ఫత్వా’ ఖతర్నాక్.. ప్రశ్నార్థకంగా విద్యార్థినులు, మహిళల భవిష్యత్..!

by vinod kumar |   ( Updated:2021-08-21 07:19:43.0  )
afganistan-womens
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆఫ్ఘన్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చిన తాలిబన్లు అందరికీ ఆమోదయోగ్యమైన పాలన సాగిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. తాము ఎవరికీ హాని చేయమని చెప్పిన వారు నెమ్మదిగా తమ పూర్వ పాలన వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ దేశంలో షరియా చట్టాన్ని అమలు చేస్తున్నట్టు ప్రకటించిన తాలిబన్లు మహిళల స్వేచ్ఛను కాలరాస్తున్నారు. ఆడవారు ఇంట్లోనే ఉండాలని, బుర్ఖా లేకుండా బయటకు రావొద్దని, మగతోడు లేకుండా ఒంటరిగా తిరగొద్దని, చదువు, ఉద్యోగాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఆఫ్ఘన్‌లోని పాఠశాలలు, కాలేజీల్లో కో-ఎడ్యూకేషన్ రద్దు చేస్తూ తొలి ఫత్వా జారీ అయ్యింది. దీని ప్రకారం అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే క్లాసులో చదువుకోవడానికి వీలుండదు. గత ప్రభుత్వ పాలనలో మహిళల అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ తాలిబన్లు క్రమంగా రద్దు చేస్తున్నారు. వీరి నిర్ణయంతో ఆఫ్ఘన్‌లో విద్యార్థినులు, మహిళల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిపోయినట్టే అని యావత్ ప్రపంచం విచారం వ్యక్తం చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed