- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వచ్చే ఏడాది నుంచి కో-ప్యాసింజర్ సీటుకు ఎయిర్‌బ్యాగ్ తప్పనిసరి!
దిశ, వెబ్‌డెస్క్: కొత్త ఏడాదిలో దేశీయంగా తయారయ్యే అన్ని ప్యాసింజర్ కార్లలో తప్పనిసరిగా డ్రైవర్ పక్క సీటుకు ఎయిర్‌బ్యాగ్ ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. కో-ప్యాసింజర్ సీటుకు ఎయిర్‌బ్యాగ్ సౌకర్యం విషయంలో గడువును పొడిగించడం కానీ, వాయిదా వేయడం కానీ ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మంగళవారం ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. 2022, జనవరి 1 నుంచి తయారు చేసిన అన్ని ప్యాసింజర్ వాహనాల్లో ఇది తప్పనిసరి. ఇదివరకు ప్రభుత్వం ఈ నిబంధన గడువును ఆగస్టు 31 నుంచి ఈ నెలాఖరుకు వాయిదా వేసింది.
ప్రస్తుతం భారత్‌లో ప్యాసింజర్ వహనాల్లో డ్రైవర్ సీటుకు మాత్రమే ఎయిర్‌బ్యాగ్ ఉండాలనే నిబంధన అమలవుతోంది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రపంచవ్యాప్తంగా జరిగే రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని తెలిపింది. అలాగే, నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్, అమెరికా ఫెడ్ ఏజెన్సీ ప్రకారం.. ఎయిర్‌బ్యాగ్, సీట్‌బెల్ట్ వల్ల మరణాలు 61 శాతం తగ్గుతున్నాయని, ఎయిర్‌బ్యాగ్‌ల వల్ల మాత్రమే 34 శాతం మరణాల రేటు తగ్గుతున్నట్టు వెల్లడించాయి.