అప్పులపాలైన, ఆస్తులు అమ్ముకున్న వారికి అది వరమే : కడియం

by Shyam |
MLC Kadiyam Srihari
X

దిశ, స్టేషన్‌ఘన్‌పూర్: ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) పేదలకు వరం అని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం జఫర్గడ్ మండలం కోనాయాచలం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు రూ. 20 లక్షల చెక్కులను శుక్రవారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యం పాలైన వారు, ఆస్తులు అమ్ముకున్న వారు, అప్పులపాలైన వారికి సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రూ.40 వేల కోట్లు సంక్షేమానికి ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. 60 లక్షల మంది రైతులకు వ్యవసాయ పెట్టుబడులు, రైతు బీమా 40 లక్షల మందికి పెన్షన్ల ద్వారా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కరుణాకర్ రావు, స్థానిక సర్పంచ్ సంపత్ రెడ్డి, ఎంపీటీసీ దేవేందర్, వెంకటస్వామి, అయోధ్య, పెద్దిరెడ్డి, రాజిరెడ్డి, బాబు, నాగరాజు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed