- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆరు నెలల గరిష్ఠానికి నిరుద్యోగిత రేటు
దిశ, వెబ్‌డెస్క్ : భారత్‌లో నిరుదోగిత రేటు 2020, డిసెంబర్‌లో 9.1 శాతంతో ఆరు నెలల గరిష్ఠానికి పెరిగింది. ఇది గతేడాది జూన్‌లో లాక్‌డౌన్ తర్వాత ఆర్థికవ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైనప్పటి నుంచి అత్యధికమని నమోదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సోమవారం తెలిపింది. 2020, జూన్‌లో నిరుద్యోగిత రేటు 10.99 శాతంగా ఉంది. ఇది నవంబర్ నాటికి 6.5 శాతానికి తగ్గింది. నవంబర్‌తో పోలిస్తే ప్రస్తుత నిరుద్యోగిత రేటు చాలా ఎక్కువ.
డిసెంబర్ 6తో ముగిసిన తొలి వారంలో నిరుద్యోగిత రేటు 8.4 శాతానికి పెరగ్గా, తర్వాత రెండు వారాల్లోనే 10.1 శాతనికి పెరిగిందని సీఎంఐఈ ఎండీ, సీఈఓ మహేష్ వ్యాస్ చెప్పారు. ‘ద్రవ్యోల్బణంతో పాటు నిరుద్యోగం కూడా పెరగడం ఆందోళన కలిగించే అంశం. ఇటీవలి కాలంలో ఇది 7 శాతం నుంచి తక్కువ వ్యవధిలో ఈ స్థాయికి పెరిగింది. దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ దిశగా పయనిస్తున్న క్రమంలో నిరుద్యోగిత రేటు పెరగడం ఆందోళనలను మరింత బలపరుస్తుందని మహేష్ వ్యాస్ వెల్లడించారు.