విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై సమీక్ష

by Shyam |
విద్యుత్ సరఫరా పునరుద్ధరణపై సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులపై టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు బుధవారం సమీక్ష నిర్వహించారు. భారీ వర్షానికి ట్రాన్స్‌ఫార్మర్లు, హెచ్‌టీఎల్‌టీ లైన్లు దెబ్బతిని సరఫరాకు అంతరాయం ఏర్పడినా విద్యుత్ వ్యవస్థను సమర్థంగా నిర్వహించామని సిబ్బందిని అభినందించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులకు ప్రత్యేక నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఎక్కడైనా సమస్యలు ఉంటే టీఎస్‌ఎస్‌పీడీఎస్‌ ప్రాంతీయ నోడల్ అధికారి నెంబర్ 9440813856, రాష్ట్ర నోడల్ అధికారి నెంబర్ 9491398550ను సంప్రదించాలని సూచించారు. విద్యుత్ సరఫరా ఫిర్యాదులకు ప్రత్యేక కంట్రోల్ ఏర్పాటు చేశామని, సమస్యలుంటే ప్రస్తుత కాల్ సెంటర్ 1912తోపాటు 7382072104, 7382072106, 7382071574, 9440811244, 9440811245ను సంప్రదించవచ్చని తెలిపారు.

Next Story

Most Viewed