- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసీఏఐ నూతన భవనం ప్రారంభించిన బిస్వరూప్ బసు
దిశ, వెబ్‌డెస్క్: ఆధునీకరించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) కార్యాలయం నూతన భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐసీఏఐ అధ్యక్షుడు సీఎంఏ బిస్వరూప్ బసు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఐసీఏఐ, దేశీయంగా విస్తృతమైన మౌలిక సదుపాయాలను కలిగిన కార్యాలయం. సంస్థకు దేశవ్యాప్తంగా 111 చాఫ్టర్ భవనాలు, 11 విదేశీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. తమ సంస్థ అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో సంస్థ పేరును ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాగా మార్చాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను విజ్ఞప్తి చేశామని చెప్పారు. తమ వృత్తికి అద్భుతమైన అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. సంస్థలో 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని, ఇటీవల సాంకేతికంగా మారిన పరిస్థితుల నేపథ్యంలో తమ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, బ్లాక్ చైన్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి అంశాలలో విధ్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.