పింగళి కుటుంబ సభ్యులకు జగన్ సన్మానం.. ప్రధానికి లేఖ

by srinivas |
ys jagan pingali family
X

దిశ, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి మరోసారి లేఖ రాశారు. పింగళి వెంకయ్యకు భారతరత్న ఇవ్వాలని సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబాన్ని జగన్‌ సత్కరించారు. జగన్‌ను చూసి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని జగన్‌తో కలిసి పంచుకున్నారు. పింగళి వెంకయ్య కుమార్తె సీతామహాలక్ష్మితో మాట్లాడిన జగన్ కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

జగన్‌ సీఎంగా కాదు.. ఒక ఆత్మీయుడిగా పలకరించారని సీతామహాలక్ష్మి అన్నారు. సీఎం జగన్‌ పలకరింపుతో వందేళ్ల ఆయుష్షు వచ్చిందన్నారు. జాతీయ జెండాను గాంధీకి స్వయంగా పింగళి వెంకయ్య అందించారని, తండ్రిగా పింగళి వెంకయ్య తనను గాంధీకి పరిచయం చేశారని ఆమె ఆనాటి జ్ఞాపకాలను జగన్ కి తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కాబోతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులకు సన్మానంతో రాష్ట్రంలో ఈ వేడుకలను సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్రాలను సీఎం జగన్ తిలకించారు.

Advertisement

Next Story