- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమిళనాడు పోలీసులకు గుడ్‌న్యూస్ చెప్పిన స్టాలిన్..
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన తీసుకునే నిర్ణయాలను ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఉచిత విద్య విషయంలో ఎక్కడా రాజీపడకూడదని అధికారులను ఆదేశించడంతో పాటు అసెంబ్లీకి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యే ఎవరి భోజనం వారే ఇంటి నుంచి తెచ్చుకోవాలని ఆదేశించారు. క్యాంటీన్ కూడా మూసివేయించారు.
ప్రజాధనం వృథాగా పోవడం ఇష్టం లేకనే ఇలా చేసినట్టు వివరణ ఇచ్చారు స్టాలిన్. తాజాగా స్టాలిన్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌కు గురిచేయగా, పోలీసులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పోలీస్ డిపార్ట్ మెంటులో పనిచేస్తున్న ఉద్యోగులందరూ వారానికి ఒకరోజు వీక్ ఆఫ్ తీసుకొవచ్చని ప్రకటించారు. వర్క్ బర్డెన్, సెలవులు లేకుండా పోలీసులు రోజు విధుల్లో ఉండటం వలన వారి ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు తెలిసింది. దీంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గతంలో పోలీసులకు వీక్ ఆఫ్ ఇస్తానని ప్రకటించారు. కానీ అది నేటికీ అమలులోకి రాకపోవడంతో పోలీసులు నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది.