- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టాలిన్ మరో సంచలనం.. చెన్నైలో సైబర్ క్రైం సెంటర్ ఏర్పాటు
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనదైన మార్క్ పాలనను చూపిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయడంలోనే కాక పౌరుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేశంలోనే ఐటీ, ఇండస్ట్రీలకు హబ్‌గా ఉన్న చెన్నైలో ఇటీవల సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే వాటికి చెక్ పెట్టేందుకు రాజధానిలో సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ విషయాన్ని మంగళవారం అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. సైబర్ క్రైం సెంటర్ ఏర్పాటుచేయడం వలన భవిష్యత్‌లో ఆర్థిక, ఇంటర్నెట్ సంబంధిత నేరాలను నియంత్రించడంలో పోలీసులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం స్టాలిన్ అభిప్రాయం వ్యక్తంచేశారు. చెన్నై కేంద్రంగా సైబర్ నేరాల నియంత్రణకు గాను ఈ సెంటర్ నోడల్ ఏజెన్సీగా పనిచేయనుందని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు.
Advertisement
Next Story