- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సకల సౌకర్యాలతో సచివాలయం
దిశ, న్యూస్‌బ్యూరో: పాత సచివాలయాన్ని సమాధి చేసిన చోటనే కొత్త సచివాలయం నిర్మాణం జరగనుంది. సకల సౌకర్యాలతో కూడిన సమీకృత సచివాలయం ఎలా ఉండాలో డిజైన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు. నూచన సచివాలయానికి డిజైన్ రూపొందించిన చెన్నయ్‌కు చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్, పొన్ని త్రీ-డీ నమూనాతో పాటు వీడియో రూపంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ప్రదర్శించారు. కొన్ని మార్పులు చేర్పులు సూచించిన సీఎం ఉద్యోగులు సౌకర్యవంతంగా పనిచేసుకోడానికి వీలుగా అన్ని విధాలా అనుకూలంగా ఉండాలని డిజైనర్లకు వివరించారు. ప్రతీ మార్పులోనూ వాస్తుకు ఇబ్బంది లేకుండా ఉండేలా అప్పటికప్పుడు తగిన సూచనలు చేసేలా వాస్తు సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం సచివాలయ ప్రాంగణంలో రెండు పాత భవనాల కూల్చివేత పనులు ఇంకా పూర్తి కాకపోయినప్పటికీ ఎలాగూ అక్కడ లాండ్‌స్కేపింగ్ వస్తుందన్న ఉద్దేశంతో మిగిలిన ప్రాంతాన్ని వీలైనంత తొందరగా పూర్తిచేయాల్సిందిగా రోడ్లు భవనాల శాఖ అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలిసింది. శ్రావణమాసంలోనే ఆ ప్రాంతంలోని శిధిలాల తరలింపు ప్రక్రియను పూర్తిచేసి చదును చేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఇది పూర్తికాగానే టెండర్లను ఖరారు చేసి నూతన డిజైన్‌కు అనుగుణంగా నిర్మాణపు పనులను ప్రారంభించే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. తాజాగా సీఎం చేసిన మార్పులు చేర్పులకు అనుగుణంగా డిజైనర్లు, అధికారులతో మరోమారు సమావేశం జరిగే అవకాశం ఉంది.
నూతన సచివాలయంలో మంత్రులు, అధికారులు పనిచేసుకోడానికి ఉండాల్సిన వాతావరణాన్ని, సౌకర్యాలను కూడా ఈ సమావేశంలో లోతుగా చర్చించారు సీఎం. ప్రతీ అంతస్తులో ఒక మీటింగ్ హాల్, డైనింగ్ హాల్, వెయిటింగ్ హాల్ తదితరాలు ఉండాల్సిందిగా సీఎం సూచించారు. సచివాలయానికి వచ్చే సందర్శకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని తగిన వాహన పార్కింగ్ స్థలాన్ని కూడా తీర్చిదిద్దాలని సూచించారు. కొత్త సచివాలయం ఎలా ఉండాలో త్రీ-డీ ఇమేజ్‌ను కూడా డిజైనర్లు ప్రదర్శించారు.