- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మోడీ రాకతో జై శ్రీరాం నినాదాలు.. ఆగ్రహంతో వెళ్లిపోయిన దీదీ!
దిశ, వెబ్‌డెస్క్ : విక్టోరియా మెమోరియల్‌లో నిర్వహించిన నేతాజీ జయంత్యుత్సవాల్లో ‘జై శ్రీరాం’, ‘భారత్ మాతాకీ జై’ నినాదాలు కలకలం రేపాయి. ఈ కార్యక్రమంలో సీఎం మమతా బెనర్జీ మాట్లాడవలసిందిగా వ్యాఖ్యాతలు ఆహ్వానించిన వెంటనే ఆహుతుల్లో కొందరు జై శ్రీరాం, భారత్ మాతాకీ జై నినాదాలనిచ్చారు. కార్యక్రమ నిర్వాహకులూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన మమతా బెనర్జీ సీరియస్‌గా మాట్లాడారు. నేతాజీ జయంతిని కోల్‌కతాలో నిర్వహించాలని నిర్ణయించిన ప్రధానమంత్రి, కేంద్ర సంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వ కార్యక్రమం హుందాగా జరగాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలను హుందాగా నిర్వహించాలని, ఇది రాజకీయ పార్టీల కార్యక్రమాలు కాదని మండిపడ్డారు.
సర్కారు కార్యక్రమానికి ఆహ్వానించినప్పుడు వారిని అవమానించవద్దని అన్నారు. ఇది అన్ని పార్టీలు, అన్ని మతాల వారు కలిసి నిర్వహించుకునే వేడుక అని తెలిపారు. ఇలాంటి పరిణామాలు కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టను మసకబారుస్తాయని అన్నారు. ఇందుకు నిరసనగా తాను ప్రసంగించబోనని, జై హింద్.. జై బంగ్లా అని నినదించి వేదిక విడిచివెళ్లారు. ప్రధాని సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం, ఆయన మౌనం వహించడం గమనార్హం. కాగా, సుభాశ్ చంద్రబోస్ లెఫ్టిస్ట్ సెక్యులర్ అని, ఆయన జయంతి కార్యక్రమంలోనే మతపరమైన వ్యాఖ్యలతో అవమానించాలని ప్రయత్నించడం దారుణమని ట్వీట్లు పోటెత్తాయి.