సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు కన్నుమూత

by Shyam |
సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు కన్నుమూత
X

దిశ, దుబ్బాక: తెలంగాణ సీఎం కేసీఆర్‌ బాల్యమిత్రుడు, కాళేశ్వర ముక్తేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మెర వెంకటేశం (75) కన్నుమూశారు. కరోనా వైరస్‌ సోకి మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు, కాళేశ్వర దేవస్థానం అధికారులు తెలిపారు. వెంకటేశం స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చెర్వాపూర్‌. కాళేశ్వర దేవస్థానం చైర్మన్‌గా రెండు పర్యాయాలు కొనసాగారు. మే 11,2018లో ఆలయ చైర్మన్‎గా తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంకటేశం.. మే 10,2019 వరకు కొనసాగారు. తిరిగి అక్టోబర్ 24,2019లో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ఆలయ చైర్మన్‌గా మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. వెంకటేశం మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు.

Advertisement

Next Story