ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ

by Anukaran |   ( Updated:2020-09-01 05:02:56.0  )
ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించాలని మంగళవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. నష్టం జరుగతుందని తెలిసినా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ బిల్లును తెలంగాణ ప్రభుత్వం సమర్థించి మొట్టమొదలు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిందన్నారు. జీఎస్టీ ఫలాలు దీర్ఘకాలికంగా ఉండి రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడానికి ఆస్కారం కలిపిస్తుంది అనుకున్నాం. సీఎస్టీనీ రద్దు చేసే సమయంలో పూర్తి పరిహారాన్ని అందజేస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. రాష్ట్రాలు సీఎస్టీ పరిహారాన్ని తిరస్కరించాయని పేర్కొన్నారు.

రాష్ట్రాల ఒత్తిడి మేరకు రెవెన్యూ నష్టాన్ని పూడ్చడానికి ప్రతి రెండు నెలలకోసారి పూర్తి జీఎస్టీ పరిహారం చెల్లించే విధంగా చట్టాన్ని రూపొందించారు. అంత కచ్చితంగా నిబంధనా ఉన్నా జీఎస్టీ పరిహారం చెల్లింపుల్లో జాప్యం కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందలేదు. కరోనా కారణంగా ఏప్రిల్ 2020లో తెలంగాణ 83శాతం రెవెన్యూ నష్టపోయిందని, అదే సమయంలో రాష్ట్రాల అవసరాలు, పేమెంట్ల భారం పెరిగిపోయిందని స్పష్టం చేశారు.

దేశ ఆర్థిక వ్యవస్థ, విత్త విధానం కేంద్రం చేతుల్లో ఉన్న కారణంగా రాష్ట్రాలు విధిగా కేంద్రంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. మార్కెట్ బారోయింగులకు కూడా కేంద్రంపై ఆధార పడాల్సి వస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని లేఖలో తెలిపారు.

Advertisement

Next Story