- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సింగరేణి’పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
దిశ ప్రతినిధి, కరీంనగర్: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి నేతృత్వంలో ప్రత్యేకంగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడంతో పాటు, సింగరేణి కార్మికులు, ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 26న జరగనున్న బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకోవాలని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, కోల్ బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు సీఎం పదవీ విరమణ వయస్సుపెంపుపై నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల 43, 899 మంది సింగరేణి కార్మికులు, అధికారులకు లబ్ధి చేకూరనుంది. రామగుండంంలో సింగరేణి మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని కూడా సీఎం నిర్ణయించారు. సింగరేణి ప్రాంత సమస్యలు పరిష్కారాలు అనే అంశంపై ప్రజా ప్రతినిధులతో ప్రగతి భవన్‌లో మంగళవారం సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, రేగా కాంతారావు, ఎమ్మెల్యేలు దివాకర్ రావు, గండ్ర వెంకట రమణారెడ్డి, వనమా వెంకటేశ్వర్, కోరుకంటి చందర్, ఆంత్రం సక్కు, కోనేరు కోనప్పలు హాజరయ్యారు.