- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వీరుడ్ని కన్నావమ్మ.. జాతి మొత్తం నీ వెంటే : సీఎం కేసీఆర్
దిశ, నల్లగొండ: భారత్ – చైనా సరిహద్దు ప్రాంతంలోని గాల్వన్ లోయలో జరిగిన ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్ బాబుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘన నివాళులు అర్పించారు. అంతకుముందు సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌజ్ నుంచి రోడ్డు మార్గం గుండా సూర్యాపేటకు చేరుకున్నారు. మొదటగా కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి పుష్ఫాంజలి ఘటించారు. అనంతరం సంతోష్ బాబు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ‘పిల్లల భవిష్యత్ బాధ్యత మొత్తం ప్రభుత్వానిదే’ అంటూ సంతోష్ బాబు కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. జాతిని గర్వించే కొడుకును కన్నావమ్మా అంటూ సంతోష్ బాబు తల్లితో కేసీఆర్ అన్నారు. యావత్ జాతి మీ వెంట ఉంటుందని, ప్రభుత్వం కుటుంబానికి అండగా నిలుస్తుందని చెప్పారు. అనంతరం ఇప్పటికే ప్రకటించిన విధంగా సీఎం కేసీఆర్ స్వయంగా సంతోష్ బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కు, సంతోష్ భార్యకు రూ.4 కోట్ల చెక్కును అందజేశారు. దాంతో పాటు సంతోష్ భార్యకు గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రం, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 711 చదరపు గజాల స్థలానికి సంబంధించిన పత్రాలు అందజేశారు. దాదాపు పది నిమిషాలకు పైగా సీఎం కేసీఆర్ కల్నల్ ఇంట్లో గడిపారు. ఆయన వెంట మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డిలు ఉన్నారు.