కేసీఆర్ నిర్ణయం చాలా గొప్పది.. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

by Shyam |   ( Updated:2021-06-28 06:28:56.0  )
CM-KCR,-Motkupalli-Narsimhu
X

దిశ, భువనగిరి: దళితుల సామాజిక, ఆర్థిక అంశాలపై సమావేశం ఏర్పాటు చేసి చార్మిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మాజీ మంత్రి, బీజేపీ కీలక నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సోమవారం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ… నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి, బలోపేతం కావడానికి భరోసా కల్పించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ ముఖ్యమంత్రి దళితుల క్షేమం కోసం సమావేశం ఏర్పాటు చేయలేదని, కేసీఆర్ పేద, దళితుల మనసు దోచుకున్నారన్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్కోదళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వడం అసాధ్యమే అయినా.. దళితుల వద్ద డబ్బు ఉంటే మార్పు, చైతన్యం వస్తుందని ముఖ్యమంత్రి భావించడం గొప్ప విషయం అన్నారు.

అంతేగాకుండా.. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు ఫోన్ చేసి, సమావేశానికి రావాలని కోరడం, సలహాలు, సూచనలు చేయాలని తనను అడగటం చాలా సంతోషం అని హర్షం వ్యక్తం చేశారు. రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని రైతుబంధు ఖాతాల్లో జమచేయాలని చెప్పడంతో సీఎం సానుకూలంగా స్పందించి ఒప్పుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం.. రెసిడెన్షియల్ స్కూల్‌లలో చదువుతున్న ఎంతోమంది విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. బీజేపీలో కొంతమంది వ్యాపారులు చేరారు. వారు చెప్పే విధానం కరెక్ట్ కాదు. వారి మాటలు వింటే పార్టీ ఆగం అయ్యే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం తీసుకున్న రూ.10 లక్షల పథకం చాలా గొప్ప పథకం దళితుల తరుపున సీఎం కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతూ మోత్కుపల్లి నర్సింహులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

యాదగిరిగుట్టను ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదుసార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు.. కలెక్టరు వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయకం అన్నారు. ఎస్సీల అభివృద్ధి గురించి ఇంతగా తపించే సీఎం కేసీఆర్‌కు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు.

Advertisement

Next Story