4న సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన

by Shyam |   ( Updated:2021-03-02 04:54:48.0  )
4న సీఎం కేసీఆర్‌ యాదాద్రి పర్యటన
X

దిశ,వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్ ఈ నెల 4న యాదాద్రిని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి పనులను పర్యవేక్షించనున్నారు. ప్రధాన ఆలయంతో పాటు పుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణ పనులను ఆయన సమీక్షించనున్నారు. వీటితో పాటుగా నూతనంగా నిర్మించనున్న ఆర్టీసీ బస్‌ టెర్మినల్‌, డిపోల స్థలాలను కూడా ఆయన పరిశీలించనున్నట్టు సమాచారం. ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించిన అనంతరం సమీక్షలో అధికారులకు సూచనలు, సలహాలను ఆయన ఇవ్వనున్నారు. సమీక్ష అనంతరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఉద్ఘాటన ముహూర్తాన్ని నిర్ణయిస్తారని తెలుస్తోంది.

Advertisement

Next Story