KCR : వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన కేసీఆర్..

by vinod kumar |   ( Updated:2021-05-21 05:12:19.0  )
KCR : వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన కేసీఆర్..
X

దిశ, వెబ్‌డెస్క్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ వరంగల్ ఎంజీఎం సందర్శనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి కరోనా రోగులను పరామర్శించిన సీఎం కొవిడ్ చికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్లును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరంగల్ సెంట్రల్ జైలు సందర్శనకు వెళ్లారు.ఆయనతో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాథోడ్‌లు ఉన్నారు. జైలు కలియతిరిగిన సీఎం ఖైదీలతో కాసేపు ముచ్చటించారు. అంతేకాకుండా జైల్లో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Next Story