RBI: ఈ దశలో వడ్డీ రేటు తగ్గించడం తొందరపాటే: ఆర్‌బీఐ గవర్నర్ దాస్

by S Gopi |
RBI: ఈ దశలో వడ్డీ రేటు తగ్గించడం తొందరపాటే: ఆర్‌బీఐ గవర్నర్ దాస్
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిటైల్ ద్రవ్యోల్బణం అధిక స్థాయిలోనే ఉన్నందున ఈ దశలో కీలక వడ్డీ రేట్లలో కోత విధించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని, చాలా రిస్క్‌తో కూడుకుని ఉంటుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తి కాంత దాస్ అన్నారు. భవిష్యత్తులోనూ మానిటరీ పాలసీ నిర్ణయాలు గణాంకాలు, ఔట్‌లుక్‌పై ఆధారపడి ఉంటాయని ఆయన తెలిపారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఎంపీసీ సమావేశంలో ఆర్‌బీఐ పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ద్రవ్య విధాన వైఖరిని తటస్థంగా మార్చినప్పటికీ, రెపో రేటును యథాతథంగా కొనసాగించింది. శుక్రవారం బ్లూమ్‌బర్గ్ నిర్వహించిన ఇండియా క్రెడిట్ ఫోరమ్ కార్యక్రమంలో మాట్లాడిన దాస్.. సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ దశలో రేటు తగ్గింపు తొందరపాటు నిర్ణయం అవుతుంది. ప్రస్తుతం ఐదున్నర ఉన్న ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నప్పుడు ఇది చాలా చాలా ప్రమాదకరమని దాస్ పేర్కొన్నారు. ఆర్థిక మార్కెట్‌పై ఆర్‌బీఐ గట్టి నిఘా ఉంచుతుందని, అవసరమైనప్పుడు నియంత్రణ చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed