ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు : సంగారెడ్డి కలెక్టర్

by Aamani |
ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు : సంగారెడ్డి కలెక్టర్
X

దిశ,సంగారెడ్డి : మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీ) దోహదపడతాయని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. యువతలో వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఆయా జిల్లాల్లో నెలకొల్పిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లలో ప్రవేశాలకు సంబంధించిన ప్రగతిపై శుక్రవారం ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏటీసీ కేంద్రాలను అర్హులైన విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని, ఈ నెలాఖరు లోపు పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరిగేలా చొరవ చూపాలని సూచించారు. వీ.సీ అనంతరం కలెక్టర్ క్రాంతి వల్లూరి, జిల్లా కార్మిక శాఖ అధికారి రవీంధర్ రెడ్డి కి ఏటీసీ కేంద్రాల ఏర్పాటు పై దిశానిర్దేశం చేశారు.

ప్రవేశాల ప్రక్రియను వేగవంతం చేయాలని, ఏటీసీ కేంద్రాల గురించి అవగాహన పెంపొందించేందుకు వీలుగా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఏటీసీ కేంద్రాలలో శిక్షణ ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సూచించారు. ఒకటి రెండు రోజుల్లోనే తాను క్షేత్రస్థాయిలో సందర్శించి ఏర్పాట్లను పరిశీలిస్తానని అన్నారు. తొలి విడతగా జిల్లాలో సంగారెడ్డి, హత్నుర ఐటీఐలు గుర్తించి ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేయడం జరిగిందన్నారు.ఏటీసీ కేంద్రాలలో మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ ( ఒక సంవత్సర కాల వ్యవధి) కోర్సు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిషియన్స్ ( ఒక సంవత్సరం), ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ ( ఒక సంవత్సరం), బేసిక్ డిజైనర్ అండ్ వర్చ్యువల్ వెరిఫైర్-మెకానికల్ (రెండు సంవత్సరాలు), అడ్వాన్స్డ్ సీ.ఎన్.సీ మషీనింగ్ టెక్నీషియన్ (రెండు సంవత్సరాలు), మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ (రెండు సంవత్సరాలు) కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందన్నారు.

పదవ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సులలో చేరేందుకు అర్హులని,ఎస్ఎస్సీ మెమో, టీ.సీ, కుల ధ్రువీకరణ పత్రం, బోనఫైడ్, ఆధార్ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చని సూచించారు. ప్రవేశాలకు ఈ నెల 31 చివరి తేదీ అయినందున గడువులోపు అర్హత, ఆసక్తి కలిగిన వారు ఏటీసీ కేంద్రాలలో నిర్దేశిత కోర్సులలో ప్రవేశాలు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని పని దినాలలో ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు సంగారెడ్డి ,హత్నూర, ప్రభుత్వ ఐటీఐ, లో ఇంటర్వ్యూ కు హాజరు కావచ్చని తెలిపారు. సంబంధిత వివరాల కోసం సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్ 9848935146, హత్నూర ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఫోన్ నెంబర్ 9963004960 సంప్రదించవచ్చని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed