తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

by Shyam |
తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. పదోన్నతులకు ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫైల్‌పై సోమవారం సంతకం చేశారు. న్యూ ఇయర్ కానుకగా జీతాలు, పదవీ విరమణ వయస్సును పెంచుతామని తెలిపిన సర్కార్.. లేటెస్ట్‌గా పదోన్నతుల విషయంపై స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో గల ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాలు చేపడుతామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story