- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హల్దీ వాగులోకి నీటిని విడుదల చేసిన సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను.. వర్గల్ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్ నుంచి హల్దీ కాల్వలోకి విడుదల చేశారు. దీంతో ఏళ్లుగా నీరు లేక వెలవెలబోతున్న హల్దీ వాగు మండుటెండలోనూ నీటితో నిండనుంది. ప్రాజెక్ట్ నుంచి నీరు వర్గల్ మండలం తునికిఖాల్సా మీదుగా అంబర్‌పేటలోని ఖాన్ చెరువకు చేరుతుంది. అనంతరం ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగుకు ఆ తర్వాత తూఫ్రాన్, వెల్లుర్తి, చిన్న శంకరంపేట మీదుగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు సాగునీరు చేరనుంది. ఈ పర్యటనలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
CM Sri KCR releasing Godavari water into Gajwel canal at Pamulaparthy village https://t.co/DNlTx68gIO
— Telangana CMO (@TelanganaCMO) April 6, 2021