- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫామ్ హౌస్‌కు వెళ్తూ.. సర్పంచ్‌ను చూసి ఆగిపోయిన కేసీఆర్
దిశ గజ్వేల్ : కాశిరెడ్డి పల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం సీఎం దత్తత గ్రామమైన వాసాలమర్రి గ్రామంలో పర్యటించిన అనంతరం తిరుగు ప్రయాణంలో తన వ్యవసాయ క్షేత్రానికి వస్తుండగా మర్కుక్ మండలంలోని కాశిరెడ్డి పల్లి గ్రామంలో కాన్వాయిని అపి గ్రామ సర్పంచ్ అప్పల మల్లేష్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సర్పంచ్‌తో మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ వరకు గ్రామంలోని ముఖ్యులు తన వ్యవసాయ క్షేత్రానికి రావాలని ముఖ్యమంత్రి కోరారు. నేను హైదరాబాద్ వెళ్లి వచ్చిన తర్వాత గ్రామస్తులతో గ్రామ అభివృద్ధి ఎలా చేసుకోవాలనే వాటి పై మాట్లాడుకుందాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని తెలిపారు. గ్రామంలో కావలసిన అభివృద్ధి పై చర్చించాల్సి ఉందన్నారు. కాశిరెడ్డి పల్లి గ్రామాన్ని అన్నివిధాలాగా అభివృద్ధి చేసుకుందామని దీనిపై అధికారులతో, గ్రామ ప్రజలతో క్షుణ్ణంగా చేర్చికుందామన్నారు. గ్రామ సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుందమన్నారని తెలియజేసినట్లు సర్పంచ్ తెలిపారు. ముఖ్యమంత్రికి గ్రామంలోని పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు.