రాపిడ్ టెస్టులో కేసీఆర్‌కు నెగెటివ్.. మరి ఆర్టీపీసీఆర్‌ టెస్టులో?

by vinod kumar |
రాపిడ్ టెస్టులో కేసీఆర్‌కు నెగెటివ్.. మరి ఆర్టీపీసీఆర్‌ టెస్టులో?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కరోనా నెగెటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సూచన మేరకు అప్పటి నుంచి లలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఐసోలేషన్‌లో ఉన్నారు. సీఎం వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు నేతృత్వంలోని వైద్యుల బృందం కేసీఆర్‌ ఆరోగ్యాన్ని పరీక్షిస్తోంది. ఈ క్రమంలో బుధవారం మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటికే రాపిడ్ యాంటీజెన్‌తో పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అలాగే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష ఫలితాలు నేడు రానున్నాయి. ఈ టెస్టుల్లో ఏం ఫలితం వస్తుందో అని రాష్ట్ర ప్రజలతో పాటు, కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో, టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కాగా, ఈ నెల 21న సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో సిటీ స్కాన్‌ సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. ఛాతీలో ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ లేదని సిటీ స్కాన్‌లో తేలినట్లు వైద్యులు వెల్లడించారు.

Advertisement

Next Story