- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజా సంక్షేమం కోసమే కొత్త చట్టాలు : KCR
దిశ, వెబ్‌డెస్క్ :
రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కోసమే కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం న్యూ రెవెన్యూ చట్టంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విప్లవాత్మక పాలనా సంస్కరణల్లో భాగంగానే వినూత్న చట్టాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. కొత్త చట్టాల అమలు కోసం ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని, చివరి గుడిసె వరకు కొత్త చట్టాల ఫలితాలు అందాలని సీఎం సూచించారు. ప్రజలకు చెందిన ప్రతి అంగుళం ఆస్తిని ఆన్ లైన్‌లో నమోదు చేస్తామన్నారు.
ప్రజాప్రతినిధులు వార్డుల వారీగా తిరిగి ప్రజల ఆస్తుల కు సంబంధించిన వివరాలను ఆన్ లైన్‌లో పొందుపరచాలని ఆదేశించారు. తెలంగాణ ఏర్పడితే భూములు ధరలు తగ్గుతాయని శాపాలు పెట్టారని, అందుకు భిన్నంగా ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. అంతేకాకుండా రాష్ట్రం ఏర్పడ్డాక, భూ కబ్జాలు, తగాదాలు, గూండాగిరీ తగ్గిందని చెప్పుకొచ్చారు.