లాక్ డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

by Shyam |   ( Updated:2020-05-03 21:24:30.0  )
లాక్ డౌన్‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
X

దిశ, న్యూస్​ బ్యూరో: నోవెల్ కరోనా వైరస్​(కొవిడ్ 19) నివారణా చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన విధివిధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆదివారం ప్రగతిభవన్​లో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలకు అనుగుణంగా స్పందించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు.

లాక్​ డౌన్​ నిబంధనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలనీ, తద్వారా కరోనా కట్టడిలో సహకరించాలని ప్రజలను కోరారు. ఇప్పటికే కేంద్రం లాక్​డౌన్​ విషయంలో పలు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపైనా ముఖ్యమంత్రి చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణ చర్యలు, లాక్​డౌన్​ పరిస్థితులను సంబంధిత అధికారుల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. కరోనా పాజిటివ్​ వచ్చిన వారితో పాటు సెకండరీ కాంటాక్ట్​ అవకాశం ఉన్నవారందరి ఆరోగ్య పరిస్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని వైద్య అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్​ కుమార్​, డీజీపీ మహేందర్​ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags: corona, lockdown, telangana, cm kcr review meeting, with officers, health minister

Advertisement

Next Story

Most Viewed