న్యాయవాదుల హత్య.. ఆ అధికారిపై సీఎం ఫైర్

by Sridhar Babu |   ( Updated:2021-02-18 07:30:25.0  )
CM KCR, Advocate couples murder
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద జరిగిన జంట హత్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. అడ్వకేట్ దంపతుల హత్య విషయమై బుధవారం రాత్రి డీజీపీతో మాట్లాడినట్టు సమాచారం. హైకోర్టు న్యాయవాదులను నడిరోడ్డుపై హత్య చేయడం ఏంటీ? లా ఆర్డర్ సమస్య ఉత్ఫన్నం కావడం వెనక పోలీసుల నిర్లక్ష్యం కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. జాయింట్ మర్డర్ కేసు విషయంలో విచారణ ఎలా సాగుతోంది, ఏ స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారని డీజీపీని అడిగినట్టు సమాచారం. దీంతో వెంటనే డీజీపీ కిందిస్థాయి అధికారులతో సమీక్ష జరిపినట్టు తెలుస్తోంది. నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డిని వెంటనే రామగుండం వెల్లి పరిస్థితిని సమీక్షించి విచారణ చేపట్టాలని డీజీపీని ఆదేశించడంతో బుధవారం అర్థరాత్రి ఐజీ హుటాహుటిన ఘటన స్థలాన్ని సందర్శించారు. రామగుండంలోనే మకాం వేసిన ఐజీ ఈ మర్డర్ కేసు విషయంలో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు.

Advertisement

Next Story

Most Viewed