సాగర్ బై పోల్: కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో?

by Anukaran |   ( Updated:2021-04-13 22:03:04.0  )
సాగర్ బై పోల్:   కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఎలా ఉంటుందో?
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రస్తుతం తెలంగాణలో రాజకీయంగా కీలకంగా మారింది. పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇక్కడ పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. గత కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థులపై విమర్శల బాణాలు సంధిస్తున్నాయి. దీంతో సాగర్ బై పోల్ తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో కేసీఆర్ ప్రత్యర్థులపై ఎలా కౌంటర్ ఎటాక్ చేస్తారనేది చర్చనీయాంశంగా మారింది. రేపటితో సాగర్ ఉపఎన్నిక ప్రచారానికి తెరపడనుంది. ఈ సందర్భంగా హాలియా వేదికగా కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు.

హాలియా పట్టణ శివారులోని పెద్దవూర మార్గంలో ఈ బహిరంగ సభ జరగనుంది. టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ఈ సభకు భారీగా ఏర్పాట్లు చేశాయి. దాదాపు లక్షమంది ప్రజలు ఈ సభకు హాజరయ్యే అవకాశాలున్నాయి.

Advertisement

Next Story