- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ మీటింగ్ ప్రారంభం.. ఏం చెప్తారన్నదానిపై ఉత్కంఠ!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం ప్రారంభం అయ్యింది. కాసేపటి క్రితమే తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్ ప్రజా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి 300మంది ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం అందింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ ఛైర్మన్లు పాల్గొన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ పునరుద్ధరణ, ప్లీనరీపై చర్చించే అవకాశాలు ఉన్నాయి.
అయితే చాలారోజుల తర్వాత టీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అవుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేటీఆర్‌కు సీఎం పీఠం అప్పగిస్తారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఉత్కంఠగా మారింది. ఫిబ్రవరి రెండో వారంలోనే కేటీఆర్ పట్టాభిషేకం, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో వెళ్తారన్న ఊహగానాల నేపథ్యంలో సరిగ్గా వారం రోజుల ముందే కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేయడం రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
ఈ సమావేశంలో నాగార్జున సాగర్ ఉపఎన్నికతో పాటు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై కూడా చర్చించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడటంతో అప్పటి నుంచి కేసీఆర్ మీడియా ముఖంగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయితే ఇవాళ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడుతారా లేకుంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మాట్లాడిస్తరా అన్నది కీలకంగా మారింది. ఒకవేళ సీఎం పీఠం కేటీఆర్‌కు అప్పగించబోతున్నట్లు ప్రకటిస్తే కేసీఆర్ ఖచ్చితంగా మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉంటాయి.