వీసీల నియామకంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

by Anukaran |
వీసీల నియామకంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్‌లర్లు (VC) నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీల నియామకం త్వరగా పూర్తి చేయాలన్నారు. అలాగే వైస్ ఛాన్స్‌లర్ల నియామక ప్రక్రియను పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

అదేవిధంగా బుధవారం ప్రగతిభవన్‌లో పలువురు ఎమ్మెల్యేలతో భేటి అయిన సీఎం.. సెప్టెంబర్7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story