- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కీలక దశకు తెలుగు రాష్ట్రాల జల వివాదాలు
దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల జల వివాదాలు కీలక దశకు చేరుతున్నాయి. అపెక్స్ కౌన్సిల్‌కు ముందు రెండు బోర్డుల సమావేశాలు నిర్వహించాలనే ఆదేశాల నేపథ్యంలో నీటిపారుదలశాఖ అధికారులు, నిపుణులతో సమావేశమవుతున్న సీఎం కేసీఆర్ ఏపీ ఫిర్యాదును ఎలా కొట్టిపారేయాలన్న దానిపై చర్చలు జరుపుతున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఏపీ నిర్మించిన ప్రాజెక్టులపై ఎదురుదాడికి దిగేలా సిద్ధం అవుతున్నారు. ఏపీ ప్రాజెక్టులపై ఫిర్యాదు చేస్తూనే మన ప్రాజెక్టుల పనులు ఆగకుండా చూడాలని సీఎం అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. గోదావరి, కృష్ణా బోర్డులకు ప్రాజెక్టులపై ఏ విధంగా చెప్పాలనే అంశాలపై దిశానిర్ధేశం చేస్తున్నారు. ప్రాజెక్టులన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలు పెట్టినట్లుగా చూపేందుకు రెడీ అవుతూ పలు అంశాలను సీఎం వివరించినట్లు సమాచారం. ఏపీ ఫిర్యాదులను బోర్డులు పరిగణనలోకి తీసుకోకుండా ఉండేందుకు పక్కాగా ప్లాన్ చేయాలని, రెండు బోర్డులకు పాత జీవోలన్నీసమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
అవన్నీ పాతవే
తెలంగాణలో ప్రాజెక్టులు, ఎత్తిపోతలన్నీ ఉమ్మడి రాష్ట్రంలోనే మొదలు పెట్టారని, వీటికి సంబంధించిన జీవోలన్నీ బయటకు తీసేందుకు నీటిపారుదలశాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రాణహిత- చేవేళ్ల రీ డిజైనింగ్‌లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మిస్తున్నామని, గత ప్రభుత్వాలు కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే చేశాయని టీఆర్ఎస్ పనులు పూర్తి చేసిందని గోదావరి బోర్డుకు వివరించనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో జారీ చేసిన జీవోలు, అనుమతులు, అప్పటి ప్రభుత్వాలు రాసిన లేఖలన్నీ బయటకు తీయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా దేవాదుల ప్రాజెక్టు, తుపాకులగూడెం ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టినట్లు నిరూపించనున్నారు. వీటితో పాటుగా గోదావరి ఎత్తిపోతల మూడో దశ, సీతారామ ప్రాజెక్టు, తెలంగాణ డ్రింకింగ్ సప్లై ప్రాజెక్టు, లోయర్ పెన్ గంగ బరాజ్‌లు, రాజ్ పేట, చనాఖా-కొరటా, పింపరాడ్-పర్సోడా, రామప్ప నుంచి పాకాలకు గోదావరి నీళ్ల మళ్లింపు ప్రాజెక్టుల వివరాలు, డీపీఆర్లను బోర్డుకు సమర్పించే అంశంపై చర్చిస్తూనే ప్రాజెక్టుల పనులు ఆపొద్దని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీ ఫిర్యాదులో కృష్ణా నదిపై నిర్మిస్తున్నట్లు చెబుతున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, వాటర్ గ్రిడ్, తుమ్మిళ్ల ఎత్తిపోతలు, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతలు, ఎస్‌ఎల్‌బీసీపై కూడా గతంలోని పూర్తి జీవోలు బయటకు తీయాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.
డీపీఆర్‌లు, నీటి కేటాయింపులే ప్రధాన అజెండా
రెండు రాష్ట్రాల జల వివాదాల నేపథ్యంలో ఈనెల 4న నిర్వహించే కృష్ణా బోర్డు సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ సమావేశంలో అజెండా అంశాలను కేఆర్ఎంబీ మంగళవారం మరోసారి వెల్లడించింది. బోర్డు ఆదేశాల ప్రకారం ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలు, డీపీఆర్లను బోర్డుకు సమర్పించాలని సూచించారు. ఇదే ప్రధాన అజెండాగా పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు ప్రకారం పాలమూరు-రంగారెడ్డి, డిండి, భక్త రామదాసు, వాటర్ గ్రిడ్, తుమ్మిళ్ల కొత్త ప్రాజెక్టులుగా, ఆన్ గోయింగ్ ప్రాజెక్టులుగా కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీలకు సంబంధించి కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీతో పాటు అపెక్స్ కౌన్సిల్ అనుమతులు లేవని, కనీస వివరాలు, డీపీఆర్‌లు ఇప్పటివరకు ఇవ్వలేదని లేఖలో సూచించారు. ఈ వివరాలను సమావేశానికి తీసుకురావాలని చెప్పారు. అదేవిధంగా 2020-21 వాటర్ ఇయర్‌కు సంబంధించి నీటి కేటాయింపులు, టెలీమెట్రీ రెండో దశ, విద్యుత్ కేటాయింపులు, నిధుల కేటాయింపులను అజెండా అంశాలుగా పేర్కొన్నారు.