అప్రమత్తంగా ఉండండి : సీఎం కేసీఆర్

by Anukaran |
అప్రమత్తంగా ఉండండి : సీఎం కేసీఆర్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నగరంలో గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. కనీసం 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలోని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడూ పరీక్షించాలని తెలిపారు.

గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌లో వర్షాలు పడ్డాయని సీఎం కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేగాకుండా మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.

Advertisement

Next Story