యాదాద్రి పున:ప్రారంభోత్సవంపై నేడు కేసీఆర్ క్లారిటీ

by Shyam |   ( Updated:2021-03-04 01:49:53.0  )
kcr yadadri
X

దిశ వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలారోజుల తర్వాత బయటికి వచ్చారు. చాలాకాలం తర్వాత ఇవాళ యాదాద్రికి పర్యటనకు కేసీఆర్ వచ్చారు. కొద్దిసేపటి క్రితం యాదాద్రికి చేరుకున్న కేసీఆర్.. ఆలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కేసీఆర్ వచ్చిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆలయ పున:నిర్మాణంపై అధికారులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. కాసేపట్లో ఆలయ అధికారులతో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించనున్నారు.. ఈ పర్యటనలో కేసీఆర్ వెంట ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు.

అధికారులతో జరగనున్న కీలక సమావేశంలో ఆలయ పున:ప్రారంభోత్సవంపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత యాదాద్రి పున:నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన కేసీఆర్.. పనులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. కేసీఆర్ యాదాద్రి పర్యటనకు రావడం ఇది 14వ సారి.

Advertisement

Next Story