కుటుంబమంతా ఒక్కటే.. పాలిటిక్స్ వేరు : రితేష్

by Shyam |   ( Updated:2020-08-18 08:35:38.0  )
కుటుంబమంతా ఒక్కటే.. పాలిటిక్స్ వేరు : రితేష్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం కేసీఆర్‌కు తమకు కుటుంబం పరంగా ఎలాంటి వైరుధ్యాలు లేవని, కేవలం రాజకీయాల పరంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కేసీఆర్ సోదరుడి మనవడు రితేష్ అన్నారు. ఇటీవల ప్రగతిభవన్ ముట్టడి ఘటనలో జైలుకు వెళ్లిన వారిలో రితేశ్ కూడా ఉన్నాడు. మంగళవారం ఆయన బెయిల్‌పై విడుదలై బయటకు వచ్చారు. ఈ సందర్భంగా రితేశ్‌తో ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ఈ విధంగా వ్యాఖ్యానించారు.

రితేశ్ వ్యాఖ్యలు ‘ప్రస్తుతం తాను ఎన్‌ఎస్‌యూఐ (NSUI) రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నాను. కరోనా సమయంలో సెట్ (SET) ఎగ్జామ్స్ నిర్వహించడం సరికాదని.. అందువలన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను 55 రోజులుగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తూనే వచ్చాం. కానీ టీఆర్‌ఎస్ సర్కార్ తమ వినతిని ఏనాడు పట్టించుకోలేదు. జేఎన్‌టీయూ నుంచి పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే, అందుకు నిరసన తెలిపాలని మా రాష్ట్ర అధ్యక్షుడు ధర్నాకు పిలుపునిచ్చారు.

అందువల్ల ప్రగతి భవన్ ముట్టడికి మేమంతా ప్రయత్నించాం. అంతేకానీ, సీఎం కుటుంబానికి తమకు ఎలాంటి కుటుంబ పరమైన వైరుధ్యం లేదని.. కేవలం రాజకీయ పరమైన వైరుధ్యం మాత్రమే ఉందని వివరించారు. కేసీఆర్ విధివిధానాలు, పాలన తీరు నచ్చకే తమ పార్టీ ద్వారా పోరాటాలు చేస్తున్నామని, కరోనా కట్టడిలో రాష్ట్ర సీఎం పూర్తిగా విఫలమయ్యారన్నారు. వందశాతం కేసీఆర్ పాలన సరిగా లేదని, విద్యార్థుల బలిదానాలతోనే తెలంగాణ రాష్ట్రం అవతరించిందని రితేశ్ మరోసారి గుర్తుచేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక విద్యార్థులను పట్టించుకోలేదని, ఉద్యోగులు రాకుండా చేస్తున్నాడని అని ఆయన ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed