- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పాలమూరుకు నర్సింగ్ కళాశాల మంజూరుకు సీఎం అంగీకారం: మంత్రి శ్రీనివాస్
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: పాలమూరు మెడికల్ కళాశాలలో నర్సింగ్ కళాశాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారని రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్ నగర్ కు నర్సింగ్ కళాశాల ను మంజూరు చేయవలసిన ఆవశ్యకతపై ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞాపన మేరకు ఆయన స్పందించి కళాశాలను మంజూరు చేశారని మంత్రి పేర్కొన్నారు. వెంటనే ప్రతిపాదనలు పంపమని ముఖ్యమంత్రి కోరడం జరిగిందని మంత్రి తెలిపారు. నర్సింగ్ కళాశాల మంజూరు పట్ల ఆస్పత్రి అభివృద్ధి చెందడంతో పాటు, జిల్లాకు వాసులు నర్సింగ్ కోర్సు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడతాయని మంత్రి పేర్కొన్నారు.
అత్యుత్తమ ఫలితాల పట్ల మంత్రి హర్షం
మహబూబ్ నగర్ మెడికల్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించడం పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ వెంకట్రావు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. 2016లో ఆరంభమైన ఈ కళాశాలకు చెందిన 140 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. 97% తో 136 మంది విద్యార్థులు ఉత్తీర్ణతను సాధించడం అభినందనీయమన్నారు. ముగ్గురు విద్యార్థులు డిస్టింక్షన్, అల్ వెల్కమ్ మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్, 92 మంది విద్యార్థులు సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణులు కావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఇందుకు కృషి చేసిన వైద్య కళాశాల డైరెక్టర్ పుట్టా శ్రీనివాస్, జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకులు డాక్టర్ రామ్ కిషన్, బోధన, బోధనేతర సిబ్బందిని మంత్రి, కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.