ఏపీ అర్చకులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్

by srinivas |
cm-jagan mohanreddy
X

దిశ, ఏపీ బ్యూరో: ఆలయ అర్చకులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో దేవాదాయశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకుల సమస్యలపై సీఎం జగన్ ఆరా తీశారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అర్చకుల సమస్యలు.. పరిష్కారానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అలాగే వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు స్పష్టం చేశారు.

అనంతరం వెల్లంపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అర్చకుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచామని గుర్తు చేశారు. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కు.. కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్ణయం పట్ల దేవాదాయశాఖ పరిధిలో పనిచేసే అర్చకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed