‘జగనన్న తోడు’ ప్రారంభం

by srinivas |   ( Updated:2020-11-25 01:41:41.0  )
‘జగనన్న తోడు’ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్: జగనన్న తోడు పథకాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బుధవారం ప్రారంభించారు. ఈ పథకం కింద చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున రుణాలను ప్రభుత్వం ఇవ్వనుంది. ఈ మేరకు 10లక్షల మంది లబ్దిదారులకు జగనన్న తోడు పథకం కింద రుణాలను ఇవ్వనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 6.40 లక్షల మంది చిరు వ్యాపారులను ప్రభుత్వం గుర్తించింది. ఐదడుగులు అంతకన్నా తక్కువ స్థలంలో షాపులు కలిగిన, తోపుడు బండ్లు, గంపల్లో వస్తువులు పెట్టుకుని ఊరూరా తిరిగి అమ్ముకునే చిరు వ్యాపారులు ఈ ఫథకానికి అర్హులని సీఎం జగన్ అన్నారు.

Advertisement

Next Story