- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికారులపై సీఎం జగన్ ఆగ్రహం.. మీరంతా ఏం చేస్తున్నారని..!
దిశ, వెబ్‌డెస్క్ : వివిధ శాఖలకు చెందిన అధికారులపై సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఏపీలో ఆదాయ మార్గాలపై సమీక్ష నిర్వహించిన ఆయన.. నకిలీ చలాన్ల స్కాంపై సంబంధిత అధికారులపై మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ శాఖల్లో నకిలీ చలాన్లు ఎలా వచ్చాయి? మీరంతా ఏం చేస్తున్నారు..? అని ప్రశ్నించారు. వ్యవస్థలు సక్రమంగా నడుస్తున్నాయో లేదో ఎందుకు చూడటం లేదు. ఏసీబీ దాడులు జరిగితే తప్ప ఈ వ్యవహారం ఇన్ని రోజులు వెలుగులోకి ఎందుకు రాలేదని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ శాఖల్లో ఇంత అవినీతి జరుగుతుంటే మన దృష్టికి ఎందుకు రాలేదని అధికారులను అడిగారు.
ఇకపై ఇలాంటివి రిపీట్ కావొద్దని.. అన్ని శాఖల్లోనూ, మీ సేవ కేంద్రాల్లోనూ చలాన్ల వ్యవహారంలో తనిఖీలు జరగాలని ఆదేశించారు. వారం, పది రోజులకొకసారి అధికారులు సమావేశం కావాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రానికి ఆదాయ వనరులపై అధికారులు దృష్టి సారించాలన్నారు. పెండింగ్ బకాయిలతో పాటు కొత్త వ్యుహాలు, కొత్త మార్గాల ద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకోవాలన్నారు. ఇందుకోసం వినూత్న సంస్కరణలు తేవాలన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండాలని, అక్రమ మద్యం రవాణా, కల్తీలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు శాఖను ఆదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ శాఖల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలన్నారు.