సీఎం జగన్ బహిరంగ క్షమాపణ

by srinivas |
సీఎం జగన్ బహిరంగ క్షమాపణ
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ సీఎం జగన్ బహిరంగ క్షమాపణలు చెప్పారు. తాను తీసుకున్న నిర్ణయంతో మీకు ఇబ్బంది కలిగితే మీ బిడ్డగా అనుకోని తనను మన్నించండి అంటూ వ్యాఖ్యనించారు. గురువారం పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం.. బహిరంగ సభలో మాట్లాడారు. గండికోట, చిత్రావతి నిర్వాసితుల త్యాగం మరవలేనిదని అన్నారు. వారికి ఇబ్బంది కలిగి ఉంటుందని, వారి త్యాగం వల్లే నేడు లక్షలాది మంది రైతులకు మేలు జరుగుతుందని కితాబు ఇచ్చారు.

గండికోట, చిత్రావతి ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు చెల్లించి వారందరినీ ప్రాధేయపడి త్వరితగతిన అక్కడి నుంచి తరలించామన్నారు. తరలింపులో కొంత మందికి కష్టమనిపించి ఉంటుందని, వారందరూ మీ బిడ్డ అనుకుని ఏదైనా పొరపాటు చేసి ఉంటే మన్నించాలని సీఎం వైఎస్ జగన్ వేదికపై నుంచి భావోద్వేగంగా మాట్లాడారు. వారి త్యాగానికి కృతజ్ఞతలు కూడా చెబుతున్నానన్నారు. నిర్వాసితులు చేసిన త్యాగాన్ని మరిచిపోకూడదని, ఆయా గ్రామాల్లో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed